Tuesday, 17 November 2015

                                                 బాధ్యత
నా మొదటి కథ లో రాము చివరకు మారాడు, ఫ్రెండ్స్ ని, తన colleagues ని అందరిని కలిసి ఆయమ్మ కు సహాయం చేసాడు. ఆయమ్మ ఇప్పుడు కోలుకుంది, తన ఇళ్ళను కూడా బాగుచేసుకుంది..
రాము మంచి బాలుడు అనిపించుకున్నాడు సహాయం చేసి!

ఒకరి బాధ నుండి విముక్తి చేయడం సహాయం అనిపించుకుంటుంది.
అలాగే బాధ్యత అంటే ఏమిటి అని ఒక ప్రశ్న మొదలైంది నా మనసులో..
ఫ్రెండ్స్ కి అడిగాను చాలా ఆలోచించాను, కాని కుదరలేదు. అదే బాధ్యత అంటే ఏంటో అని సమాధానం రాలేదు.
బాధ్యత అంటే మనవాళ్ళ కోసం మనం తీసుకునే జాగ్రత్త, మన వాళ్ళ మంచి కోరడం, ఆ మంచిని   నెరవేర్చడం.. అంటే తల్లి-తండ్రి తన  పిల్లల  కోసం  పడే  ఆరాటం, పెట్టె శ్రమ, తీసుకునే శ్రమ ఈ కోవకు  వస్తాయి
ఒక  భర్త తన  భార్య  కోసం  చేసే  త్యాగం , ఒక  భార్య  భర్త  కోసం  తపన, కూడా  ఇలానే  ఉంటాయి …
దేశం  కోసం , లేదా  మన  లోకాలితి  కోసం , సమాజం  లో  ఉంటున్నాం  కాబట్టి  మనం  కూడా   వివిధ  దశల్లో , వివిధ  సమయలో  బాధ్యత  ను  వ్యక్తపరుస్తం..
ఇలానే  దీనికి  సంబంధించి  ఒక  చిన్న  కథ  చేబుహ్తం  అనుకుంటున్నా, కథ  కాదు  ఇది  నిజంగా  జరిగినది  నా  కళ్ళ  ముందు  నా  స్నేహితుడి  చూపిన  బాధ్యత!

కంది పప్పు కి పెళ్లి చూపులు, అమ్మాయి చదువుకుంది, టీచర్  జాబు  చేస్తుంది, బావుంటుంది అండ్ ఇంకా మంచిది  అవును కంది పప్పు కి పెళ్లి ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? అదే నంది మా ఫ్రెండ్ కి అందరు పెట్టుకున్న ముద్దు పేరు. స్కూల్ కి రోజు పప్పు తిని వచ్చేవాడని ఒక కొంటె కృష్ణుడు పెట్టిన పేరు..
కాని కంది పప్పు షాక్ ఇచాడు అమ్మాయి నచలేదు అని బాంబు  పేల్చాడు అమ్మాయ్ కె కాదు వీళ్ళ  అమ్మ కు కూడా నీళ్ళు తిరిగాయి . ఎంత అడిగిన అదే మాట  ఎంత చెప్పిన అదే వ్యాఖ్య.
సరే లే ఈ అమ్మాయి  కాకపోతే ఇంకో  అమ్మాయి అని అనుకున్నారు ఇంట్లో వాళ్ళు.
ప్రతి అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నాడు  ప్రతి అమ్మాయి ఇషయంలో  ఏదో  ఒక  సాకు  ఏదో  ఒక  excuse..
విసిగిపాయింది  వాళ్ళ అమ్మ, ఏడ్చింది  గుడులు గోపురాలు తిరిగింది కాని ఫలితం లెకపొఇన్ది .
నా ఫ్రెండ్స్ లో నాకు కొంచెం మంచి పేరు ఉంది బాగా చదువుతానని వ్యసనాలు లేవని  మంచి జాబు చేస్తున్నానని చిన్న మంచి పేరు.  కంది పప్పు కి చాల క్లోజ్ ఫ్రెండ్ కూడా. నన్ను కూడా వాళ్ళ  అమ్మగారు అడిగారు ఒప్పించామన్నారు, నొప్పించకుండా  నొప్పించి కూడా వాడి గుట్టు బయట  లాగాలనుకున్నాను కాని నా వల్ల కూడా కాలేదు ఇక చేసేదేమీ లేదని వాళ్ల అమ్మగారు చిన్నోడికి  మరదలితో పెళ్లి చేయిన్చేసారు.
వీడు బిజినెస్ అని, పది మంది కోసమని, పది మందితో అని కొంచెం తిరిగేవాడు. అందరికి వాడంటే  ఇష్టం, కాని పెళ్లి వద్దన్తున్నాద్, వాళ్ల అమ్మ నాన్న కు బాధ పెట్టాడని కోపం.
రెండు సవత్సరాల తరువాత, కంది పప్పు కి ఆయాసం ఎక్కువ ఐంది, ఇబ్బంది పడుతున్నదని ఒక  డాక్టర్ దగ్గరకు తన రిపోర్ట్స్ పంపాను.
అబ్బాయికి హెఅర్త్లొ ప్రాబ్లం ఉంది, జీవితనంతం మెదిచినెస్ తోనే, ఒక 4,5 సంవత్సరాల ముందు  వచుంటే సర్జరీ చేసి ఏదో చేసేవాళ్ళం అని చెప్పాడు డాక్టర్.
చేబుహ్తం ఈ మాట కూడా అన్నాడు, ఇతనికి పెళ్లి కాకపోతే చేయకండి. ఒక అమ్మాయి జీవితాన్ని  పాడు చేసినవాళ్ళం అవుతం అని అంటూ, ప్రెస్చ్రిప్తిఒన్ చేతులో పెట్టాడు..
అప్పుడు అర్ధం ఐంది నాకు, వాడు పెళ్లి ఎందుకు వద్దనుకున్నాడో..
అప్పుడు తెలిసింది ఎంత చెప్పిన వాడు ఎందుకు వినలేదో
అప్పుడే ఊహించగాలిగాను వాడు ఎంత మంచోదో అని.
ఒక అమ్మాయి జీవితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు, ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి  కోసం, ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అప్పుడు అనిపించింది నాకు, వ్యసనాలు లేకపోవడం మాత్రమే మంచితనం కాదు
తల్లి తండ్రి మాట విని ప్రయోజకుడు అవ్వడం మాత్రమే మంచితనం కాదు అని
ఒకరి భోగులు, చూసుకువడం కూడా మంచితహనమె,
నాకు అయితే బాధ్యత కు ఇంకో డెఫినిషన్ తెలిసింది,
మనిషిగా ఒక మనిషి మంచి కోసం ఏ పని ఐన బాధ్యత అనిపించుకుంటుంది..
వాడికి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అయినందుకు గర్వ పడుతున్నాను
థాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ రా కంది పప్పు...