Tuesday, 6 February 2018

Success Mantra

ఒక రాజుగారు 5వ సారి యుద్ధం ఓడిపోయి తిరిగి వెళ్తున్నాడు. అతని దిగులు ను చూసిన ఒక సన్యాసి కారణం అడిగాడు
ఎం లేదు స్వామి నేను ఒక రాజును, యుద్ధం లో ఓడాపోయాను. ప్రేరణ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ విజయం వరించట్లేదు, లోపం తెలియట్లేదు స్వామి.

అయితే ఒక త్రాగుబోతును అనుసరించు, నీకు ప్రేరణ దొరుకుతుంది.

అదేంటి స్వామి, అలా అంటున్నారు అయినా సరే,  ఒక త్రాగుబోతును 5 రోజులు అనుసరిస్తాను.
తిరిగి వచ్చి స్వామి ని కలిసి విచారంగా ఉన్నాడు రాజు.

వాడు పచ్చి మోసగాడు, త్రాగుటకు, అబ్బాద్దలు ఆడుతున్నాడు, ఎవ్వరిని లెక్కచేయాడు, సిగ్గు లేదు వాడికి, ఎవరిని పడితే వాడిని డబ్బు కానీ మందు కానీ అడుగుతాడు. నా జీవితంలో 5రోజులు వ్యర్థం అనిపించింది.

అవునా, హ హ అని స్వామి నవ్వారు, నవ్వు ఆపి ఒక మాట అన్నారు. 
ఎం చేసినా సరే, వాడు త్రాగడం ఆపలేదు గా
అవునా కాదా అని రాజును అడిగారు.

అవును అన్నారు రాజు

 వాడి గమ్యం త్రాగటం, దాని కోసం ఏదైనా చేస్తాడు
నువ్వు కూడా అలాగే ఉండు
నేర్చుకోవదానికి సిగ్గు పడకు,
గెలుపు కోసం ఎవరికి కూడా లెక్కచేయకు
ఓడిపోయావు అని నీ మెదడుకు అనిపిస్తే తనని మాయ లో పెట్టి ప్రేరణ ఉంచుకో
 అబ్బద్దలు చెప్పు నీ శరీరంకి అలుపు వచ్చింది ఆగిపోతాను అంటే, అలాంటిది ఏమి లేదు అని అబ్బద్దం చెప్పు
ఇదే నీ జీవిత రహస్యం అని రాజు కి చెప్పాడు

6వ సారి యుద్ధం కి వెళ్లి రాజు గెలుచుకున్న విషయం సన్యాసికి తెలిసింది

No comments:

Post a Comment