Sunday, 7 April 2019

srama and Saayam - Telugu

ఆలా  వానరాలు శ్రీ రామ చంద్రుని కోసం ఒక  వారధి నిర్మించి ఇచ్చినందుకు పేరు పేరున అందరికి కృజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పి 
నాలా సోదరులను మరియు ఉడతను సన్మానించారు

ఈ రోజు రామాయణ కథ సారాంశం ముగిసింది అని వాల్మీకి మహర్షి అందరికి చెబుతున్నారు తన ఆశ్రమం  లో

ఇంతలో ఒక మునీంద్ర  అడిగారు 
మహర్షి, శ్రీ రామ చంద్ర ప్రభువులు చేసిన దాంట్లో ఒక తప్పిదం కనిపిస్తుంది

వాల్మీకి మహర్షి : శ్రీ రామ చంద్రుడు ఏ తప్పు చేయదు 
నీ అనుమానం లో ఒక తాత్పర్యం ఉంది  ఉంటుంది
మునీంద్ర: మహర్షి, వారధి ఒక  పెద్ద పని అది పూర్తి చేయడం అంటే చాలా మంది  సహాకార్యం లేనిదే జరగదు 

వాల్మీకి మహర్షి: అవును నాయనా

మునీంద్ర: అయితే అందులో నాలా సోదరులు సాయం అవర్ణాతీతం, వారు లేనిదే  ఈ  వారధి లేదు వారి పాత్ర అంత గొప్పది 

వాల్మీకి మహర్షి : అవును నిజం, అందుకే ప్రభు వారిని సన్మానించి సత్కరించి  కృతజ్ఞతలు తెలిపారు 

మునీంద్ర: అవును నిజమే,  ఇందులో సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు సాయం  లేదంటారా 

వాల్మీకి మహర్షి : ముమ్మాటికీ ఉంది, వీరు లేనిదే వారధి సాధ్యం కానిది

మునీంద్ర: మరి అలాంటప్పుడు ఉడుత కు ఎందుకు సన్మానించారు

వాల్మీకి మహర్షి : చక్కటి ప్రశ్న, మన మునీంద్ర ఎం అడుగుతున్నారంటే వారధి నిర్మాణంలో ఉడుత యొక్క సాయం తక్కువ కదా ఐన కూడా శ్రీ రామ
శ్రీ రామ చంద్ర మహాపురుషుడు అతను చేసిన ప్రతి పనిలో ఒక మర్మం ఉంటుంది
స్వామి ఉడుత కి తన శ్రమ కోసం ప్రశంసించారు పొగిడారు అభినందించారు  సన్మానించారు

మున్నెన్ద్ర: అర్ధం కాలేదు మహర్షి  ?

వాల్మీకి మహర్షి: ప్రతి సాయం వెనకాల రెండు విషయాలు ఉంటాయి 
ఒకటి ఆ సాయం వలన మనకి ఎంత  లాభం వచ్చింది 
రెండు ఆ సాయం చేసే మనిషి శ్రమ ఎంత అని 

కొన్ని సందర్భాల్లో కొంచెం శ్రమ తో చేసే సాయం కి ఎక్కువ లాభం వస్తుంది 
కొన్ని సందర్భాల్లో ఎక్కువ శ్రమ తో చేసే సాయం కి తక్కువ లాభం వస్తుంది

ఉడతా వళ్ళ సాయం తక్కువ ఐన తన సాయం లో శ్రమ ఎక్కువ
అందుకు స్వామీ ఆ చిన్న జీవికి సన్మానించారు

అలాగే మన చుట్టూ కూడా ఇలాంటివి చాల ఉంటాయి మనం తెలుసుకోవాలి

No comments:

Post a Comment